బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్( Anurag Kashyap ) గురించి మనందరికీ తెలిసిందే.తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటారు.
సమాజంలో జరిగే పలు విషయాలపై అలాగే సినిమాలకు సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే సినిమాలు ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అనురాగ్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.కోలీవుడ్ స్టార్ దర్శకుడి సినిమాలో చేయాలనుందనే కోరికను అనురాగ్ కశ్యప్ బయటపెట్టారు.
అదే విషయాన్ని తనస్టైల్లో చెప్పారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనురాగ్ ఇంటర్వ్యూలో బాగా మాట్లాడుతూ.లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చూపిస్తారు.ముఖ్యంగా మరణానికి సంబంధించిన సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరిస్తారు.తన సినిమాలో నటించాలని ఉంది.ఆయన సినిమాలో ఒక్కసారి చనిపోయినా చాలు.
పెద్ద పాత్ర అవసరం లేదు.చనిపోయే పాత్ర అయితే చాలు అని తెలిపారు అనురాగ్.
అలాగే విజయ్ సేతుపతి నటించిన విడుదలై( Vidudhalai ) పార్ట్ 1గురించి మాట్లాడుతూ విజయ్ ప్రశంసల వర్షం కురిపించారు.అంతేకాకుండా విడుదలై పార్ట్ 2 సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
కాగా ఇంటర్వ్యూలో భాగంగా అనురాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ( Social Media )వైరల్ గా మారాయి.గతంలో చాలా సందర్భాల్లో డైరెక్టర్ అనురాగ్ తనకు లోకేష్ కనకరాజు సినిమాలు అంటే చాలా ఇష్టమని అంతేకాకుండా తన సినిమాలలో నటించాలన్న ఆశ తనకు ఉంది అని పలు సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.తాజాగా అదే విషయాన్ని మరోసారి బయట పెట్టారు అనురాగ్.ఇక కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు విషయానికి వస్తే.ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.ఎన్నో మంచి మంచి సినిమాలకు డైరెక్టర్గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు లోకేష్.