తెలుగులో ప్రముఖ దర్శకుడు కే. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన “మన్మధుడు” చిత్రంలో అక్కినేని నాగార్జునను “అభి ఇక్కడ ఇంత మంది ఉండగా నేను మాత్రమే నీకు ఎందుకు నచ్చాను.?” అంటూ తన ముద్దు ముద్దు డైలాగులతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన హీరోయిన్ “అన్షు అంబానీ” గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది రెండు చిత్రాలే అయినప్పటికీ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.
అయితే ఆ మధ్య ఏమైందో ఏమో గాని హీరోయిన్ అన్షు అంబానీ సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.
దీంతో అన్షు సచిన్ అనే అమెరికాకు చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.
అనంతరం దుస్తులకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని చేస్తూ ప్రస్తుతం కోట్లలో లాభాలను అర్జిస్తోంది.అయితే సినిమాల్లోకి రాకముందు అన్షు అంబానీ మోడలింగ్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో పని చేసింది.
ఈ అనుభవం తన పెళ్లయిన తర్వాత దుస్తుల వ్యాపారాన్ని పెంచుకునేందుకు మరియు పోటీ రంగంలో నిలబడి తట్టుకునేందుకు బాగా ఉపయోగించుకుంది.అలాగే అన్షు అంబానీ కి ఒక పాప కూడా ఉంది.
ప్రస్తుతం అన్షు ఒక పక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ మరోపక్క తన వ్యాపార బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలోనే లండన్ లో సెటిల్ అయింది.
దీన్ని బట్టి చూస్తే అన్షు అంబానీ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు బొత్తిగా కనబడడం లేదు.
అయితే అన్షు అంబానీ హీరోయిన్ గా మూడు చిత్రాల్లో నటించింది.ఇందులో ఈ అమ్మడు నటించిన రెండు తెలుగు చిత్రాలు కింగ్ నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే గాక మంచి గుర్తింపును కూడా తెచ్చాయి.