జై భీమ్ ఖాతాలో మరో రికార్డ్..!

సూర్య నటించి నిర్మించిన జై భీమ్ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే కాదు రికార్డులు అందుకుంటుంది.గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఓ లాయర్ ఎలా న్యాయం చేశాడు అన్నది జై భీమ్ సినిమా కథ.

 Another Record For Surya Jai Bhim ,  Surya , Jai Bhim, Kollywood , Tollywood , G-TeluguStop.com

ఈ సినిమాలో సూర్య నటన చాలా గొప్పగా అనిపించింది.జ్ఞానవెల్ డైరక్షన్ లో వచ్చిన సినిమాలో లేటెస్ట్ గా మరో రికార్డ్ వచ్చి చేరింది.

ఆల్రెడీ 2020లో సూర్య నటించిన ఆకాషం నీ హద్దురా సినిమా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ లో ఉండగా ఇప్పుడు జై భీమ్ 2021 గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ లో ఉంది.జై భీమ్ కోసం ప్రేక్షకులు గూగుల్ లో బాగా వెతికారు.2021లోనూ టాప్ ప్లేస్ లో నిలిచి సూర్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ అయ్యేలా చేశారు.

ఇక ఈ లిస్ట్ లో సిద్ధార్థ్ మల్ హోత్రా నటించిన షేర్షా సెకండ్ ప్లేస్ లో ఉంది.

సల్మాన్ ఖాన్ రాధే 3వ స్థానంలో నిలిచింది.బెల్ బాటం, ఎటర్నల్స్, మాస్టర్, సూర్యవంశీ,గాడ్జిలా వర్సెస్ కాంగ్, దృశ్యం 2, భుజ్ ది ప్రైజ్ ఆఫ్ ఇండియా సినిమాలు ఈ జాబితాలో ఉన్నవి.

ఓ పక్క జై భీమ్ పై తమిళనాడులో ఒకవర్గానికి చెందిన వారు గొడవలు చేస్తుండగా మరోపక్క సినిమా రికార్డులు సృష్టిస్తూ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube