తెలుగమ్మాయి అంజలి ఎన్ని ఆస్తులు సంపాదించిందో తెలుసా?

అంజలి.తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.

 Anjali Properties And Remuneration Details, Heroine Anjali, Heroine Anjali Prope-TeluguStop.com

కోనసీమలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే తమిళంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్పుకోవచ్చు.

తెలుగులో పలువురు టాప్ హీరోలతో కలిసి నటించింది.బాలయ్య, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన యాక్ట్ చేసింది.

అయితే 10 వరకు సొంతూరులోనే చదువుకున్న అంజలి.ఆ తర్వాత చెన్నైకి వెళ్లింది.

నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

ఈ అమ్ముడు నటించిన జర్నీ, డిక్టేటర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి.

అందులో తన నటనతో అంజలి జనాలకు మరింత దగ్గర అయ్యింది.తాజాగా తను నటించిన పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ లో కూడా మంచి నటన కనబర్చింది.

అసలు పేరు బాల త్రిపుర సుందరి అయినా.సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంజలి గాపేరు మార్చుకుంది.2006లో ఫోటో మూవీతో సినిమా రంగంలోకి వచ్చిన ఆమె.ఆ తర్వాత సింగం-2, బ‌లుపు, శంక‌రాభ‌ర‌ణం, స‌రైనోడు లాంటి సినిమాలు చేసింది.

అటు సినిమా రంగంలోకి రాకముందు తను ఏం సంపాదించలేదు.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక బాగానే ఆస్తులను కూడబెట్టింది.

చెన్నైతో పాటు హైదరాబాద్ లోనూ ఆమె సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని తెలిసింది.అయితే ఆస్తుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో గొడవ పడింది.కొందరు తన బంధువులే ఆస్తులను తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది కూడా.ఆ తర్వాత ఈ వివాదం నెమ్మదిగా సర్దుమణిగింది.అటు అంజలికి ర‌జ‌నీ కాంత్‌, ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఇష్ట‌మైన హీరోలు సావిత్రి, శ్రీదేవి అభిమాన నటీమణులు.అంజలి ఒక్కో సినిమాకు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.అయితే తను చాలా కాలంగా సినిమా పరిశ్రమలో ఉన్నా.టాప్ హీరోయిన్ గా మారలేదు.

Anjali Properties and Remuneration Details #Anjali

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube