శేఖర్ మాస్టర్ ( Sekhar Master ) టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శేఖర్ మాస్టర్ స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా పనిచేస్తున్నారు.అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో కార్యక్రమానికి ఈయన జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ కార్యక్రమం సెలబ్రెటీ షోగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు పాల్గొంటున్నారు.
ఇక జడ్జిగా శేఖర్ మాస్టర్ అలాగే హీరోయిన్ ప్రణీత ( Praneetha ) కొనసాగుతున్నారు.

ఈనెల 27వ తేదీ ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించినటువంటి ప్రోమో తాజాగా విడుదల చేశారు.ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు తమ డాన్స్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు.అయితే చివరిలో యాంకర్ శివ ( Anchor Siva )వేదిక పైకి ఎంట్రీ ఇస్తూ మైక్ తీసుకొని శేఖర్ మాస్టర్ గురించి బాంబు పేల్చారు.
వచ్చి రాగానే మైక్ తీసుకొని శేఖర్ మాస్టర్ మీకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందంట కదా నిజం చెప్పండి బయట ఈ విషయం వైరల్ అవుతుంది అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ సీరియస్ అవుతూ ఎవరయ్యా ఈయన్ని పంపించింది ఇక్కడికి అంటూ మాట్లాడటంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా షాక్ అయ్యారు అయితే యాంకర్ శివ ఎంత చెప్పాలని ప్రయత్నం చేసిన శేఖర్ మాస్టర్ వినలేదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా,నాకంటూ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు.నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అంటూ శేఖర్ మాస్టర్ సీరియస్ అయ్యారు.ముందు ఈయన్ని ఇక్కడి నుంచి పంపిస్తారా లేక నన్నే వెళ్లిపొమ్మంటారా అంటూ శేఖర్ మాస్టర్ చెప్పినప్పటికీ శివ అక్కడి నుంచి కదలకపోవడంతో శేఖర్ మాస్టర్ బయటకు వెళ్లిపోయారు.
దీంతో అందరూ షాక్ అయ్యారు మరి నిజంగానే వీరీ మధ్య గొడవ చోటు చేసుకుందా లేకపోతే ప్రోమో స్టంటా అనే విషయం తెలియాల్సి ఉంది.