యాంకర్ అనసూయకు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో మూవీలో..?  

anasuya bharadwaja malayalam debut mammotty movie, anasuya, Khiladi, Rangamartanda, bhishma parvam, mammootty, yatra movie - Telugu Anasuya, Bhishma Parvam, Mammootty, Yatra Movie

బుల్లితెర యాంకర్ అనసూయకు జబర్దస్త్ షో ద్వారా వచ్చిన క్రేజ్ తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కారణమవుతోంది.ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించి మెప్పించగల నటి కావడంతో అనసూయకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

TeluguStop.com - Anasuya Bharadwaj Malayalam Debut Mammotty Movie

తెలుగులో ప్రస్తుతం ఖిలాడీ, రంగమార్తాండ సినిమాల్లో నటిస్తున్న అనసూయ `మలయాళంలో మమ్ముట్టి నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

కొన్నేళ్ల కితం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో మమ్మట్టి నటించగా అనసూయ ఆమూవీలో చిన్న పాత్రలో నటించారు.

TeluguStop.com - యాంకర్ అనసూయకు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో మూవీలో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న భీష్మపర్వం అనే సినిమాలో అనసూయ ఆఫర్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది.యాత్ర సినిమా వల్లే అనసూయకు ఈ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Telugu Anasuya, Bhishma Parvam, Mammootty, Yatra Movie-Movie

భీష్మ పర్వం సినిమాకు అమల్‌ నీరద్ దర్శకత్వం వహిస్తుండగా సినిమాలో ఒక పాత్రకు అనసూయ బాగుంటుందని దర్శకుడు భావించినట్టు సమాచారం.మాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా భవిష్యత్తులో అనసూయ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో అనసూయ నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొన్ని నెలల క్రితం వరకు తెలుగుకే పరిమితమైన అనసూయ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అవుతూ ఉండటం గమనార్హం.గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్స్ చెస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పలు సినిమాల్లో అనసూయ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత యాంకర్ గా, నటిగా సక్సెస్ అయిన అనసూయ వరుస ఆఫర్లతో బిజీ అవుతూ ఇతర నటీమణులకు షాక్ ఇస్తుండటం గమనార్హం.

#Mammootty #Anasuya #Bhishma Parvam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు