Ananya Nagalla : ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. కోరికలు మామూలుగా లేవుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మల్లేశం ( Mallesam ) సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు నటి అనన్య నాగళ్ళ( Ananya Nagalla ) . ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు.

 Ananya Nagalla Comments About Her Fiance-TeluguStop.com

ఇక పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించినటువంటి ఈమె ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.

ఇటీవల తంత్ర(Tantra ) అనే హర్రర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మార్చి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమాతో పాటు అనన్య మరి కొన్ని సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తంత్ర సినిమా( Tantra ) మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించారు.ముఖ్యంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాల గురించి అనన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కాబోయే భర్త( Future Husband ) ఎలా ఉండాలి అనే ప్రశ్న ఎదురవడంతో తనకు కాబోయే భర్త హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాలో నాని ( Nani ) క్యారెక్టర్ ఉంటుంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని వెల్లడించారు.గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి.రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలి అంటూ తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే అనన్య పొట్టేలు అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube