IPL 2024 RR Vs DC : ఈరోజు జరిగే ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో గెలిచే టీమ్ అదేనా..?

ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్( Rajasthan Royals ) ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) టీమ్ లా మధ్య ఒక మ్యాచ్ అయితే జరగనుంది.ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడునున్నట్లుగా తెలుస్తుంది.

 Ipl 2024 Rajasthan Royals Vs Delhi Capitals Match Today Details-TeluguStop.com

ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఒక మ్యాచ్ లో విజయం సాధించి మంచి కాన్ఫిడెంట్ తో ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇప్పటికే ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోయి ఓటమితో ఈ సీజన్ ను ప్రారంభించింది.ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu David, Delhi, Ipl, Jos Buttler, Mitchell Marsh, Rishab Panth, Rr Dc, Sanj

మరి ఈ రెండు టీముల్లో కూడా చాలా మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ వాళ్లలో ఏ ప్లేయర్ బాగా ఆడతాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఢిల్లీ టీం లో కనక చూసుకున్నట్లయితే రిషబ్ పంత్,( Rishab Pant ) డేవిడ్ వార్నర్,( David Warner ) మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్లు మాత్రం అనుకున్న విధంగా పర్ఫామెన్స్ అయితే చేయడం లేదు.ఇక టీమ్ బాధ్యతను మోసే ప్లేయర్ లేకపోవడం వల్లే గత సంవత్సరం ఢిల్లీ టీమ్ ఫెయిల్ అయింది.ఇక ఈ సంవత్సరం కూడా మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది.

మరి ఈ మ్యాచ్ లో గెలిచి వాళ్ల ఫామ్ ను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

Telugu David, Delhi, Ipl, Jos Buttler, Mitchell Marsh, Rishab Panth, Rr Dc, Sanj

ఇక ఇది ఇలా ఉంటే రాజస్థాన్ ప్లేయర్లైన సంజు సంశాన్,( Sanju Samson ) యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు.మొదటి మ్యాచ్ లో సంశాన్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ ను గెలిపించాడు.ఇక ఇప్పుడు కూడా అదే సీను ను రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రస్తుతం రెండు టీమ్ లు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి 60% గెలిచే అవకాశం ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి 40% గెలిచే అవకాశాలు ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube