ఉగ్రవాద సంస్థకి మద్దతిస్తారా అంటూ అనంత శ్రీరామ్ సీరియస్ పోస్ట్..!!

ప్రముఖ సినీ రచయిత అనంత శ్రీరామ్( Ananta Sriram ) ఎప్పుడు ఏదో వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో చిక్కుకుంటూ ఉంటారని సంగతి తెలిసిందే.తెలుగు చలనచిత్ర రంగంలో అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు.

 Anantha Sriram Serious Post Saying Do You Support A Terrorist Organization, Isr-TeluguStop.com

చిన్న వయసులోనే ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఉన్నత స్థానాలను అందుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అనంత శ్రీరామ్ ఉగ్రవాదంపై( terrorism ) సంచలన పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టులో ఉగ్రవాద సంస్థకి మద్దతు తెలిపిన పార్టీ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

“ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండటమో ఏదో ఒక దేశానికి మద్దతివ్వడమో చేయెచ్చు.కానీ ఒక దేశానికి ,ఒక ఉగ్రవాద సంస్థకి యుద్ధం జరుగుతున్నపుడు బుద్ధున్నోడెవడైనా ఉగ్రవాద సంస్థకి మద్దత్తిస్తాడా ….మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పార్టీని 6 దశాబ్దాలు భరించడం మా తప్పైపోయింది… ఇక మీదట ఆ అదృష్టం మాకొద్దులే నాయనా” అనీ పోస్ట్ పెట్టారు.

అయితే ఈ పోస్ట్ పట్ల సోషల్ మీడియాలో చాలామంది నెటిజెన్స్ కాంగ్రెస్ పార్టీపై అనంత శ్రీరామ్ విమర్శలు చేశారని అంటున్నారు.విషయంలోకి వెళ్తే ఇజ్రాయెల్… హమాస్ ఉగ్రవాదుల మధ్య… బీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సామాన్యులు చాలామంది చనిపోతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ పాలస్తీనాకు సపోర్ట్ చేసే రీతిలో.

ప్రకటన చేయడం జరిగింది.దీంతో అనంత శ్రీరామ్ తాజా పోస్ట్ కాంగ్రెస్ పార్టీనీ ఉద్దేశించిందేనని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube