తన తండ్రి చివరిగా మాట్లాడిన మాటలు ఇవే అంటూ ఎమోషనలైన రీతూ చౌదరి?

An Emotional Ritu Chaudhary Said That These Were The Last Words Spoken By Her Father ,Ritu Chaudhary ,Ritu Chaudhary Father ,Tollywood,social Media Star

తెలుగు బుల్లితెరకు చెందిన సీరియల్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి.ఈమె అతి తక్కువ సమయంలో టాలీవుడ్ బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

 An Emotional Ritu Chaudhary Said That These Were The Last Words Spoken By Her Fa-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తూ ఉంటుంది.ఇక ఈ బ్యూటీ మొదట్లో డబ్స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ప్రియుల దృష్టిలో పడింది.

తర్వాత యూట్యూబ్ లలో కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి అందులో కూడా తన నటనకు గుర్తింపు తెచ్చుకుంది.దీంతో ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా అవకాశం వచ్చింది.

అంతేకాకుండా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం కూడా రావడంతో బుల్లితెరపై బాగా దూసుకెళ్లింది.అలా గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.ఇక కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.

జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఓవైపు సీరియల్స్, మరోవైపు కామెడీ షో లతో బాగా బిజీగా మారింది.

ఇక తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.

సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.

Telugu Ritu Chaudhary, Tollywood-Movie

పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.ఈమె తండ్రి కూడా ఈమెతో చాలా రీల్స్ చేశాడు.అవి కూడా బాగా క్లిక్ అయ్యేవి.

అలా తన తండ్రిని కూడా సోషల్ మీడియా ప్రియులకు పరిచయం చేసింది రీతూ చౌదరి.అయితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయింది రీతూ.పైగా తన తండ్రి సోషల్ మీడియా ప్రియులకు పరిచయం ఉండటంతో సోషల్ మీడియా ప్రియులు కూడా తన తండ్రి మరణించిన విషయాన్ని తట్టుకోలేక పోయారు.

ఇక ఆమె పోస్ట్ చేసిన ప్రతిసారి ఆమెకు ధైర్యం ఇస్తూ ఉన్నారు.

Telugu Ritu Chaudhary, Tollywood-Movie

అయితే ఆమె కాస్త మానసిక ప్రశాంతత కోసం కాసేపు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టింది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది.అంతేకాకుండా తన తండ్రి గురించి ఎదురైన సమాధానాలను కూడా బాధపడుతూ చెప్పింది.

ఇక ఓ అభిమాని మీ డాడ్ తో లాస్ట్ ఏం మాట్లాడారు అక్క అని అడగగా.మార్నింగ్ యూట్యూబ్ వ్లాగ్ చేద్దాం ఎర్లీగా పడుకో అమ్ములు అని అన్నారు.

ఇది లాస్ట్ కన్వర్జేషన్.మార్నింగ్ నేను లేగవటం మా డాడ్ లేడు అని న్యూస్ తో అంటూ బాగా ఎమోషనల్ అయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube