దారుణం : వారి వల్ల నిలబడే బిడ్డకి జన్మనిచ్చిన గర్భిణీ...

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అత్యవసర లాక్ డౌన్ విధించారు.అందువల్ల అత్యవసర సదుపాయాలు తప్ప అవసరమైనటువంటి సర్వీసులను మూసివేశారు.

 America, Mexico, Women Given Birth, Police, Hospital-TeluguStop.com

దీంతో తాజాగా తొమ్మిదినెలల గర్భంతో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓ మహిళ మెక్సికో నుంచి అమెరికా  సరిహద్దు ప్రాంతంలో నిలబడే ప్రసవించిన ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే మెక్సికో ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది.

అయితే ఈమె ప్రస్తుతం 9 నెలలు గర్భంతో ఉంది.అయితే తాజాగా ఈ మహిళ తన భర్తతో కలిసి అమెరికాకి వెళుతుండగా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వీరిని అడ్డగించారు.

అంతేగాక విచారణ నిమిత్తమై ఓ గదిలో ఉంచారు.అయితే ఈ సమయంలో మహిళకి పురిటి నొప్పులు మొదలయ్యాయి.

దీంతో ఆమె ఉన్నచోటే ప్రసవించడం మొదలుపెట్టింది.అయితే ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రసవించడానికి మహిళ చాలా ఇబ్బంది పడింది.

దానికి తోడు మహిళ ప్రయాణిస్తున్న సమయంలో ప్యాంటు ధరించి ఉండటంతో ఈ ప్రసవం మరింత ఇబ్బందికరంగా మారింది.

అయితే భార్య ప్రసవ వేదన కేకలు విన్నటువంటి భర్త వెంటనే ఆమె గదిలోకి వెళ్లి ప్యాంటు కిందికి లాగి బిడ్డని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని కాపాడాడు.

దీంతో వెంటనే అప్రమత్తమై నటువంటి పోలీసులు మహిళలు మరియు బిడ్డను చికిత్స నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ విషయం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా నెలలునిండినటువంటి గర్భవతిని విచారణ నిమిత్తమై వేచి ఉంచడాన్ని తప్పుబడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube