తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి వైరస్ వచ్చింది పల్లెల్లో ప్రజలు వణికిపోతున్నారు.
కాస్త చదువుకున్న వారు ఇంట్లో ఉంటే హోమ్ ఐసోలేషన్ కి అనుమతి ఇస్తున్నారు.లేదు అంటే అక్కడ ఉన్న కోవిడ్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన 108 సిబ్బంది రహదారిలోనే వదిలేసి వెళ్లారు.ఇంకా ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.మడకశిర నియోజకవర్గం గుండమల పంచాయతీ పీఎస్ తండాకు చెందిన గోపీ నాయక్ అనే వృద్ధుడికి 16 రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో అతనికి అనంతపురం జిల్లాలోని కరోనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఏం జరిగిందనేది పూర్తిగా తెలియదు కానీ చికిత్స పొందాల్సిన వ్యక్తి మడకశిర వెళ్లే రహదారిలో ఉన్నాడు.
దీంతో స్థానికులు ఆరా తీసి అతనికి కొడుకుకు సమాచారం అందించడంతో అతని కొడుకు తిమ్మానాయక్ తండ్రిని స్వగ్రామానికి తీసుకెళ్లారు.అయితే కరోనా బాధితుడిని 108 ఇలా నడిరోడ్డుపై వదలడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.