తమిళ బ్యూటీ అమలా పాల్ నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆమె పెళ్లి దగ్గర నుండి విడాకుల వరకు ఏదో ఓ వార్తతో సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది.
అయితే ఆమె పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా నిలవడంతో భర్త ఏఎల్ విజయ్‌తో విడాకులు తీసుకుంది.ఇక అమలా పాల్ పెళ్లి పెటాకులైన తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.
అమలా నటించిన ఆమె చిత్రం ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఆ సినిమాలో అమ్మడు నూలుపోగు లేకుండా నటించి అందరి ఫ్యూజులు ఔట్ చేసింది.
కాగా ఇప్పుడు మరోసారి అమలా పాల్ సోషల్ మీడియాలోకెక్కింది.గతకొద్ది రోజులుగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎఫైర్లో ఉందనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరనే విషయంపై చాలా మందిలో క్లారిటీ లేదు.అయితే భవ్నింధర్ సింగ్ అనే వ్యక్తితో అమలా పాల్ గతకొద్ది రోజులుగా డేటింగ్ చేస్తుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఆమె ప్రతి నిర్ణయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌తో చెప్పుకున్నాకే తీసుకుంటుందని తెలుస్తోంది.
క్రిస్టియన్ అయిన అమలా పాల్, ముస్లిం కుర్రాడు భవ్నిందర్ సింగ్‌ను డేటింగ్ చేస్తుండటంతో వారిద్దరి గురించి తమిళ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై అమలా పాల్ ఎప్పుడూ స్పందించకపోవడం గమనార్హం.మొత్తానికి పెళ్లి పెటాకులయ్యాయనే విషయాన్ని అమలా పాల్ పూర్తిగా మర్చిపోయిందని ఆమె సన్నిహితులు చెబుతుండటంతో మరి ఈ కుర్రాడిని ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.