ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.
హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించింది.
సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.
ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 ఘన విజయంతో పార్ట్ 2 అంచనాలు అమాంతం పెరగడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడు సుకుమార్.
ఈ సినిమా పార్ట్ 2 కోసం బడ్జెట్ లెక్కలు కూడా మారిపోయాయి.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా పార్ట్ 2 కోసం మేకర్స్ 375 కోట్లు లేదా 400 కోట్లు ఖర్చు చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి.కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 350 కోట్ల బడ్జెట్ ను ఫిక్స్ చేసారని టాక్.ఈ బడ్జెట్ లోనే రెమ్యునరేషన్ కూడా కలిపి నిర్మాతలు ఫైనల్ గా 350 కోట్లకు ఫిక్స్ చేసారని ఇప్పుడు టాక్ బయటకు వచ్చింది.
ఈ మొత్తంలో సుకుమార్ 45 నుండి 50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా.అల్లు అర్జున్ హిందీ రైట్స్ తో కలిపి 90 కోట్లు డిమాండ్ చేసారని చెబుతున్నారు.
ఇలా వీరిద్దరి పారితోషికాలే 140 కోట్లు చేరుకోగా మిగతా ఆర్టిష్టుల రెమ్యునరేషన్ కూడా పెరగడంతో మొత్తంగా సినిమా బడ్జెట్ ను పెంచేసి 350 కొట్లగా ఫైనల్ చేసారని తాజాగా వార్త వైరల్ అవుతుంది.మరి ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
మొత్తానికి అల్లు అర్జున్ ఈసారి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.