టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రూ.118 కోట్ల కమీషన్ పై ఐటీకి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబు కబుర్లు నమ్మమన్న మంత్రి సీదిరి అవి లంచం రూపంలో వచ్చినవేనని ఆరోపించారు.చంద్రబాబు తిన్నది రూ.118 కోట్లు మాత్రమే కాదన్న మంత్రి సీదిరి కొన్ని లక్షల కోట్ల తిన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో ఐటీ, ఈడీ, ఏసీబీ చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని తెలిపారు.మూడు సార్లు సీఎంగా ఉంటూ రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు.అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.