విశాఖపట్నం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయిందని సమాచారం.ఢిల్లీ నుంచి విమానం పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సి ఉంది.
అయితే పోర్టుబ్లెయిర్ లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విశాఖలో ల్యాండ్ అయిందని తెలుస్తోంది.
అయితే నిన్న రాత్రి విమానం ల్యాండ్ అవగా ప్రయాణికుల కోసం సమీపంలోని హోటల్ లో వసతి ఏర్పాటు చేశారు.
పోర్టుబ్లెయిర్ వెళ్లాల్సిన 270 మంది ప్రయాణికులు విశాఖలోనే ఉండిపోవాల్సి వచ్చింది.అయితే వీరిలో ఎక్కువగా మెడికల్ కౌన్సిలింగ్ కు వెళ్లాల్సిన వారే ఉన్నారని తెలుస్తోంది.24 గంటలు కావొస్తున్నా విమానం ఎప్పుడు బయలు దేరుతుందనే ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
.
తాజా వార్తలు