ఎన్నికల ముందు జగన్ ఉక్కిరి బిక్కిరి ?

వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి( Y.S.Jagan Mohan Reddy )ని పలు సమస్యలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి.ఇప్పటికే పార్టీలో వర్గపోరు అంతకంతకు పెరుగుతుండడంతో నియోజిక వర్గాల వారీగా ఆ ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉంది.

 Agan Choked Before The Election, Cm Jagan Tdp Party, Bjp Party, Nagendra Kumar-TeluguStop.com

మరోవైపు అమరావతి రైతుల ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇప్పటికే జగన్ ను తలపట్టుకునేలా చేస్తోంది.ఇంకా మరోవైపు వివేకా కేసు ( YS Viveka )ఎటొచ్చీ జగన్ చుట్టూనే తిరుగుతోంది.

ఇవి చాలదన్నట్లు ఇప్పుడు ఇసుక విషయంలో కూడా జగన్ కు ఇబ్బందులు గురౌతున్నాయి.

Telugu Ap, Bjp, Cm Jagan Tdp, Nagendra Kumar, Ycp, Ys Jagan, Ys Viveka-Politics

తాజాగా ఇసుక తవ్వకాలు ఆపాలని ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించింది.ఇటీవల నాగేంద్ర కుమార్( Nagendra Kumar ) దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపిన దర్మాసనం రాష్ట్రంలోని 110 ఇసుక ఇచ్ లలో తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది.దీంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇసుక తవ్వకల్లో జగన్ సర్కార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని, ఎన్నో రోజులుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

ఇక గతంలో కూడా జగన్ సర్కార్ పై ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రకమైన ఆరోపణలు చేసిన సంగతి విధితమే.దీంతో జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పర్యావరణ విఘాతనికి పాల్పడుతోందనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది.

Telugu Ap, Bjp, Cm Jagan Tdp, Nagendra Kumar, Ycp, Ys Jagan, Ys Viveka-Politics

ఇప్పటికే చాలా అంశాలు జగన్( CM Jagan ) సర్కార్ ను చుట్టుముడుతుండగా ఇప్పుడు పర్యావరణ పరంగా రిషికొండ మరియు ఇసుక తవ్వకాల విషయంలో నేషనల్ పర్యావరణ సంస్థలు జగన్ సర్కార్ పై వేలెత్తి వేలెత్తి చూపిస్తున్నాయి.ఈ సమస్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.అయితే ఈ సమస్యల సమస్యల నుంచి జగన్ అంతా తేలికగా బయట పడే అవకాశం లేదు.మరోవైపు ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి.అసలే ఈసారి 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో వీటన్నిటిని దాటుకొని జగన్ మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపడతారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube