లోకల్ ట్రైన్ లో ఒక వ్యక్తి తాకరాని చోట తాకాడట.. నటి ఏం చేసిందంటే?

మహిళలకు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.కొందరు ఆ అనుభవాలను బహిరంగంగా చెప్పుకుంటే మరికొందరు మాత్రం వాటిని ఇతరులతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు.

 Aditi Rao Hydari Shares Her Bad Experience In Local Train Incident, Aditi Rao Hy-TeluguStop.com

అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించటానికి ఎన్నో చట్టాలు అమలులో ఉన్నప్పటికీ కొత్త చట్టాలను అమలులోకి తీసుకురావాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి.

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అదితీరావు హైదరీ తన జీవితంలో ఎదురైన షాకింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

తాను టీనేజ్ లో ఉన్న టైమ్ లో లోకల్ ట్రైన్ లో ట్రావెలింగ్ చేసేదానినని తనకంటే వయస్సులో పెద్ద అయిన వ్యక్తి తనను తాకకూడని చోట తాకాడని ఆమె అన్నారు.మొదట రైలులో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుకోకుండా జరిగి ఉండవచ్చని భావించానని ఆమె అన్నారు.

Telugu Aditirao, Bad Experience, Train, Mahasamudram, Touch, Nani, Tollywood-Mov

అయితే ఆ వ్యక్తి తన శరీర భాగాలను మళ్లీమళ్లీ తాకడంతో అతనికి బుద్ధి చెప్పాలని తాను అనుకున్నానని ఆ తర్వాత ఆ వ్యక్తిని ఆపి తాను చెంప పగులగొట్టానని చెప్పుకొచ్చారు.చేతిలో ఉన్న కాలేజ్ బ్యాగ్ ను సైతం ఆ వ్యక్తిపై విసిరికొట్టడంతో పాటు అలాంటి పనులు భవిష్యత్తులో ఎప్పుడూ చేయవద్దని వార్నింగ్ ఇచ్చానని ఆమె అన్నారు.ఆడపిల్లలకు తల్లిదండ్రులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని అదితిరావు హైదరీ చెప్పుకొచ్చారు.

Telugu Aditirao, Bad Experience, Train, Mahasamudram, Touch, Nani, Tollywood-Mov

పిల్లలకు సమాజం గురించి అవగాహన కల్పించాలని ఆమె అన్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు.తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఈ బ్యూటీ సత్తా చాటడం గమనార్హం.

గతేడాది విడుదలైన వి సినిమాలో అదితిరావు హైదరీ నటించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube