ఇటీవల కాపులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీనిపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు స్పందించారు.
సొంత సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ తాను మాత్రమే ఎదగాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాడని తెలిపారు.ఇటీవల వైఎస్సార్ సీపీలో ఉన్న కాపు కొడకల్లారా.
అంటూ పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని వాడుకుంటున్నారా? అని అడపా శేషు ధ్వజమెత్తారు.శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా అడషా శేషు మాట్లాడుతూ.
‘వంగవీటి రంగా హత్యకు కారకుడైన చంద్రబాబు పక్కన చేతులు కట్టుకుని నిలబడిన పవన్ కళ్యాణ్ కాపుల పరువును తీశాడు.గతంలో జనవాణి కార్యక్రమానికి వచ్చి రంగా విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయలేదు.
పవన్ కళ్యాణ్‌కు కాపుల పట్ల ఏం ప్రేమ లేదా? పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికులు శ్రమిస్తుంటే.ఆయన మాత్రం చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు.
చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చొబెట్టాలంటే ఈ విధంగా వ్యవహరించడాన్ని కాపు యువత గుర్తించాలి.’ అని తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిలా కనిపించడం లేదు.యువతకు మూడు పెళ్లిళ్ల నినాదం ఇస్తే వారి పరిస్థితేంటి? చంద్రబాబు ఇచ్చిన స్క్రీప్ట్ చదివి వెళ్లిపోతే అంతిమంగా కాపు కులమే అవహేళనకు గురవుతుందని గుర్తించాలన్నారు.చంద్రబాబు-పవన్ కళ్యాణ్ దర్శకత్వంలోనే కాపులపై కుట్ర జరుగుతోందన్నారు.వైఎస్సార్‌సీపీలో ఉన్న కాపు నేతలు కాపులు కాదా? విశాఖలో మంత్రులపై దాడుల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని అడషా శేషు తెలిపారు.2014లో జనసేన వల్ల అధికారంలోకి వచ్చి చంద్రబాబు అనేక దుర్మార్గానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.1000 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అడపా శేషు చెప్పారు.