జాతి రత్నాలు సినిమాతో దర్శకుడు అనుదీప్ ఒక్క సారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.భారీ ఎత్తున ఆయన తదుపరి సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.
ఆ సమయం లో శివ కార్తికేయన్ హీరోగా తమిళ్ మరియు తెలుగులో ఒకేసారి ప్రిన్స్ అనే సినిమా ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చక చగా పూర్తి చేసి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
జాతిరత్నాలు స్థాయిలో సినిమా ఉంటుందని తెలుగు ప్రేక్షకులు చాలా నమ్మకం గా ఉన్నారు.కానీ జాగ్రత్తగా స్థాయిలో సినిమా లేదు అంటూ తేలి పోవడం తో ప్రేక్షకులు అటు వైపు చూడడం లేదు.
కానీ తమిళం లో మాత్రం సినిమా కు పాజిటివ్ టాక్ దక్కిందిజ.

ఎందుకంటే జాతి రత్నాలు సినిమా స్థాయిలో ఉంటుందని వారు ఆశించలేదు.అసలు అక్కడ జాతి రత్నాలు సినిమా విడుదల కాలేదు.కనుక ప్రిన్స్ వారిని నిరాశ పర్చలేదు.
ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ప్రిన్స్ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసినట్లుగానే చెప్పుకోవాలి.మొదటి రోజే ఏకంగా ఏడు కోట్ల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
తెలుగు రాష్ట్రంలో కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా ఈ సినిమా రాబట్ట లేక పోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.యంగ్ హీరో శివ కార్తికేయన్ కి అక్కడ ఉన్న పాపులారిటీ నేపథ్యం లో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
తెలుగు రాష్ట్రంలో లాంగ్ రన్ లో ఈ సినిమా 10 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుందని అంతా భావించారు.కానీ అందులో సగం కూడా కలెక్ట్ చేసే పరిస్థితి లేదంటూ బాక్సాఫీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అనుదీప్ తమిళనాడు లో సక్సెస్ అయ్యాడు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిరాశ పరిచాడని చెప్పాలి.







