తెలుగు ప్రేక్షకులకు దివంగత నటి స్టార్ హీరోయిన్ సౌందర్య( Heroine Soundarya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆమె భౌతికంగా మనకు దూరం అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
సౌందర్య మరణించి కొన్ని ఏళ్లు అవుతున్నా కూడా ఆమె మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.అతి చిన్న వయసులోనే ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి జాతీయ అవార్డులు ( National Awards )సైతం అందుకుంది సౌందర్య.
ఒక తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ ఇలా ఎన్నో భాషల్లో నటించి మెప్పించింది సౌందర్య.టాలీవుడ్ లో కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
ఆమె నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి.కానీ ఊహించని విధంగా సౌందర్య అతి చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య కు సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే సౌందర్య ఎక్కువ ఆక్వా ఫోబియా ( Aqua phobia )ఉందట.
ఈ ఫోబియా ఉన్నవాళ్లు వాటర్ ని చూస్తే చాలు చాలా భయపడిపోతారట.వాటర్ ని చూడాలి అన్నా వాటర్ ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు.
అయితే అలాంటి ఫోబియా ఉన్న సౌందర్యకు 2002లో కన్నడలో దీప అనే మూవీలో నటించారు.
ఆ సినిమా డైరెక్టర్ గిరీష్( Director Girish ) సౌందర్య వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి సౌందర్య గారికి స్విమ్మింగ్ వచ్చు కదా అని అడిగారట.స్విమ్మింగ్ కాదు కదా తనకు వాటర్ చూస్తేనే చాలా భయం అందుకే కనీసం తను బోటింగ్ కి కూడా వెళ్ళదు చెప్పడంతో డైరెక్టర్ గిరీష్ షాక్ అయ్యారట.ఎందుకంటే ఆ దీప అనే మూవీలో 100% మూవీ వాటర్ లోనే షూట్ చేయాలట.
అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు సౌందర్య గారు నాకు ఈ సినిమా కథ నచ్చింది తప్పకుండా ఈ సినిమా చేస్తాను అని చెప్పి వాటర్ అంటే తనకు భయం ఉన్నప్పటికీ ధైర్యంగా నటించిందట.ఆమె కష్టానికి తగ్గట్టుగానే ఈ సినిమా అప్పట్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సౌందర్య జాతీయ అవార్డుని సైతం సొంతం చేసుకుందట.
కర్ణాటక ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయట.