సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు( Celebrities ) సోషల్ మీడియాలో, మెసేజింగ్ యాప్స్ లో వచ్చే మెసేజ్ ల వల్ల, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ ల వల్ల ఇబ్బందులు పడుతుంటారు.బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి( rachitha mahalaxmi ) తన మాజీ భర్త గురించి సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.
తన భర్త బెదిరిస్తున్నాడని రచిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పదేపదే సందేశాలు పంపుతూ భర్త ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రచిత అన్నారు.
అయితే ఈ విషయం తెలిసిన దినేష్ ( Dinesh )సైతం పోలీస్ స్టేషన్ కు చేరుకుని సంజాయిషీ ఇచ్చారు.అవసరం అనుకుంటే రచిత కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకోవచ్చని దినేష్ వెల్లడించడం గమనార్హం.
పిరివం సంతిప్పమ్( Pirivam Santhippam ) అనే సీరియల్ ద్వారా రచిత, దినేష్ లకు పరిచయం ఏర్పడింది.ఈ సీరియల్ ద్వారా వీళ్లిద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు.

ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు రావడంతో ఈ ఆన్ స్క్రీన్ జోడీ ఆఫ్ స్క్రీన్ జోడీగా మారడం గమనార్హం.2013 సంవత్సరంలో రచిత, దినేష్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.అయితే కొంతకాలం క్రితం వీళ్లిద్దరి మధ్య గొడవలు జరగడంతో వీళ్లిద్దరూ మీడియాకు ఎక్కారు.నటుడు దినేష్ మాత్రం రాబోయే రోజుల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతుండటం గమనార్హం.

గతంలో రచిత బెస్ట్ ఫ్రెండ్ జీజీ ( Jiji )కూడా దినేష్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.రచిత, దినేష్ తమ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రచిత్, దినేష్ మీడియాకెక్కడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.రచిత, దినేష్ విడాకులు తీసుకుంటే మంచిదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.