Mohan Babu: నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కెరియర్ లో ఏదో ఒక సమయంలో అనేక రకాల కష్టాలను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న వారు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించిన వారే.

 Actor Mohan Babu Latest Interview 71th Birth Day Special-TeluguStop.com

వారిలో విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఒకరు.మోహన్ బాబు( Mohan babu ) కూడా కెరియర్ మొదట్లో ఎన్నో రకాల కష్టాలను అనుభవించారు.

ఇదే విషయాన్నీ స్వయంగా మోహన్ బాబు చెప్పుకొచ్చారు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు తాను ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి వివరించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ… మీకు నేను పైకి బాగానే కనిపించవచ్చు.కానీ నా సినిమా కెరీర్ లో( Cine career ) ఎదురైన ఇబ్బందుల వల్ల నా ఇల్లు కూడా అమ్ముకున్నాను.అప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు.వాటితో పాటుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నాను.నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది.నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదని అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.

కాగా మోహన్ బాబు మొదట దాసరి నారాయణరావు తెరకెక్కించిన స్వర్గం నరకం సినిమాతో( Swargam narakam movie ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు.తనదైన విలనిజంతో, హీరోయిజంతో.ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు.

తనదైన నటనతో.విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసుకున్నారు.

కాగా మోహన్ బాబు మాత్రమే కాకుండా ఆయన కూతురు మంచు లక్ష్మి కొడుకులు మంచు మనోజ్, మంచు విష్ణు లు కూడా ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube