టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఒక ఇంటర్వ్యూలో చరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మంచి రోజులు వచ్చాయి సినిమాకు నేను కరోనా వచ్చిన సమయంలో ఇంటి దగ్గర గడిపిన జీవితానికి పోల్చవచ్చని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.ఆడపిల్లను కన్న ప్రతి తండ్రికి ఆ సినిమా కనెక్ట్ అవుతుందని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.
మారుతి గారితో నా ప్రయాణం విచిత్రమైన ప్రయాణమని అజయ్ ఘోష్ తెలిపారు.మారుతి విజయవాడలో కలిసిన సమయంలో సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పి పక్కా కమర్షియల్ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
పుష్ప సినిమా జరుగుతోందని చెప్పగా సుకుమార్ తో నేను మాట్లాడతానని మారుతి చెప్పారని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.కరోనా సెకండ్ వేవ్ తర్వాత మారుతి చిన్న సినిమా చేస్తున్నానని చెప్పి మంచి రోజులు వచ్చాయి సినిమాలో ఆఫర్ ఇచ్చారని అజయ్ ఘోష్ పేర్కొన్నారు.
మంచి రోజులు వచ్చాయి సినిమాలోని రోల్ కు అంతగా కనెక్ట్ అయిపోయానని అజయ్ ఘోష్ చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరి జీవితంలో చావు కన్ఫామ్ అని అజయ్ ఘోష్ తెలిపారు.నా అంతరాత్మకు నేను కరెక్ట్ అనిపిస్తే చాలని అజయ్ ఘోష్ అన్నారు.అనుమానంతో కాపురం చేయలేమని ఆయన కామెంట్లు చేశారు.
నాకు కరోనా ఎలా వచ్చిందో కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు.ఆచార్య సినిమా సమయంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల ఆస్పత్రికి వెళితే హార్ట్ కు చికిత్స చేయాలని అన్నారని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.ఆచార్యలో వేషం వేయలేకపోయానని నాకు బాధగా అనిపించిందని అజయ్ ఘోష్ అన్నారు.రంగస్థలం సినిమాలో చరణ్ తో ఫైట్ సీన్ చేయగా కాలు మెలితిరిగి పడిపోయానని అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.
ఆ సమయంలో రామ్ చరణ్ అపోలోకు తీసుకెళ్లి నాకు వైద్య చికిత్స చేయించారని రామ్ చరణ్ గ్రేట్ అనేలా అజయ్ ఘోష్ కామెంట్లు చేశారు.