ఆచార్య రిజల్ట్ విషయంలో టెన్షన్.. కొరటాల సంచలన వ్యాఖ్యలు వైరల్!

కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆచార్య సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది.చిరంజీవి, చరణ్, కొరటాల శివ ఈ సినిమాకు రెమ్యునరేషన్లు తీసుకోలేదు.

 Acharya Movie Release Tensions Koratala Shiva Comments Viral In Social Media ,-TeluguStop.com

కొరటాల శివ ఆచార్య ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నా సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు అని అనుకోనని నా సినిమాలలో బలమైన పాత్రలు, ఆ పాత్రల ఎమోషన్స్ మాత్రమే ఉంటాయని కొరటాల శివ కామెంట్లు చేశారు.

తన సినిమాల ద్వారా ప్రభావితమై ఎవరైనా మంచి పనులు చేస్తే మాత్రం సంతోషిస్తానని కొరటాల శివ అన్నారు.

ఆచార్య సినిమా కథను నక్సలిజం భావజాలం ఉన్న వ్యక్తి టెంపుల్ టౌన్ కు వస్తే ఏ విధంగా ఉంటుందనే కథాంశంతో రాసుకున్నానని ఈ సినిమాలో కథా నేపథ్యం కొత్తగా ఉంటుందని కొరటాల శివ చెప్పుకొచ్చారు.ఆచార్య ఆవేశపరుడు అని సిద్ధ ఏ ప్రాబ్లమ్ ను అయినా కూల్ గా డీల్ చేసే విద్యార్థిగా కనిపిస్తాడని కొరటాల శివ కామెంట్లు చేశారు.

ఆచార్య, సిద్ధ లక్ష్యం ఒకటేనని ఆచార్య టెంపుల్ టౌన్ కు ఎందుకు వెళ్లాడో సిద్ధ అడవులకు ఎందుకు వచ్చాడో తెలుసుకోవడమే ఈ సినిమా కథ అని ఆయన వెల్లడించారు.ఆచార్య సినిమాలో మాస్ ఎంగేజింగ్ బ్లాక్స్ ఉన్నాయని చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కమర్షియల్ పంథాలో ఆచార్య కథ చెప్పామని ఆయన పేర్కొన్నారు.

సిద్ధ పాత్ర సెకండాఫ్ లో ఉంటుందని చిరంజీవి, చరణ్ లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva, Ram Charan, Temple Town-Movie

సినిమా అంటే పరీక్ష అని ఆచార్య రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.పరీక్ష బాగా రాస్తే అనుకున్న మార్కులు వస్తాయా రావా అని టెన్షన్ అని ఆచార్య రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నానని ఆయన వెల్లడించారు.మరోవైపు ఆచార్య బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

చిరంజీవి, చరణ్ కష్టపడి ప్రమోషన్స్ చేస్తున్నా ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు అయితే ఏర్పడలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube