ఆచార్యలో మహేష్ బాబుని ఎందుకు తీసుకోలేదు.. కొరటాలకు చేదు అనుభవం?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి,రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య.ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుండటంతో చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

 Acharya Director Koratala Siva Clarification On Ram Charan Siddha Character Over-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇకపోతే చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంటూనే సినిమాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు అన్న విషయం తెలిపారు.

ఆచార్య సినిమాలోని పాద ఘట్టం మహేష్ బాబు వాయిస్ తో పరిచయం చేస్తున్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో మహేష్ బాబు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన సిద్ధ పాత్రకు మొదటగా మహేష్ బాబుని అనుకున్నారట.దర్శకుడు కొరటాల శివ కూడా అందుకు తగ్గట్టుగానే కథను రెడీ చేసుకున్నారు అన్న వార్తలు కూడా వినిపించాయి.

Telugu Acharya, Chiranjeevi, Koratala Siva, Mahesh Babu, Pawan Kalyan, Ram Chara

కానీ మహేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటుగా, పారితోషికం కూడా దాదాపుగా 35 కోట్లకు పైగా డిమాండ్ చేయడంతో మహేష్ బాబు ప్లేస్ లో రామ్ చరణ్ తీసుకున్నారట.అయితే ఈ వార్తల్లో నిజం ఎంత? నిజంగానే సిద్ధ పాత్రకు రామ్ చరణ్ కి బదులుగా మహేష్ బాబు ని అనుకున్నారా? రామ్ చరణ్ కు వచ్చిన తర్వాత కథలో మార్పులు చేశారా? అన్న ప్రశ్నలపై దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ.సిద్ధ పాత్రకు మహేష్ బాబు అని అనుకున్నారు ఆ తర్వాత రామ్ చరణ్ ని ఎలా తీసుకువచ్చారు అని రిపోర్టర్ అడగడంతో.అప్పుడు కొరటాల శివ మహేష్ బాబు అని మీరు అనుకున్నారు.నేను కాదు.మీరు అనుకున్న దానికి నన్ను సమాధానం అడిగితే ఏం చెప్తాను.

ఈ సినిమా కథ మొదట ఏమనుకున్నామో అదే తీశాం.ఒక్క సీన్ కూడా మార్చలేదు.

ఎక్స్ ట్రా తీయలేదు.చాలా క్లియర్‌గా ఉంది.

ఈ పాత్రకు రామ్ చరణ్ అని అనుకున్నాం.ఆయనతోనే తీశాం అని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube