అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.పాడేరు ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడింది.
వంద అడుగుల లోతులో బస్సు పడిపోయిందని తెలుస్తోంది.
చెట్లు కొమ్మను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిందని సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
అదేవిధంగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.