కొంతకాలం క్రితం ధనుష్ ఐశ్వర్య విడాకులకు( Dhanush Aishwarya Divorce ) సంబంధించిన ప్రకటన చేసి అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.అయితే ధనుష్ ఐశ్వర్య విడిపోవడానికి అసలు కారణం వెలుగులోకి రాలేదు.
ప్రముఖ హీరోయిన్ వల్లే ధనుష్ ఐశ్వర్య విడిపోయారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.ధనుష్ ఐశ్వర్య మధ్య గొడవలకు ఇల్లు కారణమని సమాచారం.
ధనుష్ ఐశ్వర్య విడిపోయి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది.పెళ్లైన 18 ఏళ్ల తర్వాత ధనుష్ ఐశ్వర్య విడిపోవాలని తీసుకున్న నిర్ణయం అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.రెండేళ్ల క్రితం ధనుష్( Hero Dhanush ) పోయేస్ గార్డెన్ లో ఒక ఇంటిని నిర్మించడం జరిగింది.ఈ ఇంటి కోసం ధనుష్ ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.
అయితే ధనుష్ ఆ ఇంటిని నిర్మించడం రజనీకి ఇష్టం లేదట.ధనుష్ ఎంచుకున్న ప్లేస్ సరైన ప్లేస్ కాదని ఆ ప్లేస్ లో ఇల్లు కట్టిస్తే వాస్తు సంబంధిత సమస్యల వల్ల కుటుంబంలో కలహాలు వస్తాయని రజనీ( Rajinikanth ) భావించి అదే విషయం ధనుష్ కు చెప్పారట.
అయితే ధనుష్ మాత్రం ఈ విషయాలను పట్టించుకోకుండా ఇళ్లు నిర్మించడం గమనార్హం.ఈ ఇంటి పనులు మొదలైన తర్వాత ధనుష్ ఐశ్వర్య మధ్య గొడవలు వచ్చాయట.
మా నాన్న కంటే రిచ్ గా ఇల్లు ఎందుకు కడుతున్నావని ఐశ్వర్య( Aishwarya ) ప్రశ్నించడంతో ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది.ఆ గొడవ అంతకంతకూ పెద్దదైందని సమాచారం.ధనుష్ ఐశ్వర్య కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ధనుష్ ఐశ్వర్య సమస్యలను పరిష్కరించుకుని కలిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.స్టార్ హీరో ధనుష్, రజనీ కూతురు ఐశ్వర్యలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.