బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు అభిషేక్ బచ్చన్.కెరీర్ మొదట్లో సరైన సక్సెస్ లేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న అభిషేక్ బచ్చన్ ధూమ్ సినిమాతో భారీ సక్సెస్ సాధించారు.
ధూమ్ సిరీస్ లో తెరకెక్కిన ధూమ్ 2, ధూమ్ 3 కూడా అభిషేక్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.అమితాబ్ బచ్చన్, జయబచ్చన్ ల కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్ నిన్నటితో 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
అభిషేక్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ ను 2007 సంవత్సరంలో వివాహం చేసుకోగా ఈ జంటకు ఆరాధ్య అనే కూతురు 2011 సంవత్సరంలో జన్మించింది.నిన్న అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు కావడంతో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో అరుదైన ఫోటోలను షేర్ చేశారు.
అభిషేక్ చిన్న వయస్సులో తాను వాడి చేయి పట్టుకుని ముందుకు నడిపించానని ప్రస్తుతం వాడు నా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నాడని అమితాబ్ బచ్చన్ తెలిపారు.

అమితాబ్ షేర్ చేసిన ఫోటోలలో ఒక ఫోటోలో అభిషేక్ బచ్చన్ ఐస్ క్రీమ్ తింటున్నారు.కొన్ని నెలల క్రితం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.అయితే అమితాబ్, అభిషేక్ త్వరగానే కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
చిన్నప్పుడు అభిషేక్ కెమెరా ముందుకు రావాలంటే తెగ సిగ్గుపడేవాడు.కానీ తర్వాత కాలంలో తన నటనతో అభిషేక్ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, షూటింగ్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు.కొన్ని రోజుల క్రితం అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోను షేర్ చేయగా ఫోటోలో అభిషేక్ బచ్చన్ తాత, తండ్రిలను ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.