శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ప్రైవేట్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.ఇటీవల కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు హిందూపురం పరిసర ప్రాంతాల్లో చెరువులు నిండి పొంగి ప్రవహిస్తున్నాయి.
పట్టణంలోని చౌడేశ్వరి కాలనీ ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో కొట్నూరు చెరువు నిండి వారం రోజులుగా భారీగా మొరవ నీరు ప్రవహిస్తోంది.
హిందూపురం – పెనుకొండ రోడ్డు కావడంతో 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు మొరవ నీటిలో ప్రమాద స్థాయిలో బస్సు పక్కకు వాలిపోయింది.
ప్రయాణికులందరు భయంతో కిందకు దిగేశారు.స్థానికులు ప్రయాణికులను క్షేమంగా దించి వెంటనే బస్సును పక్కకు తొలగించారు.