కోతిని ఎగిరెగిరి తన్నిన కోడి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!.

సోషల్ మీడియాలో ఎక్కువగా యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.వీటిలో అధికంగా కుక్కలు, పిల్లులు, కోతుల వీడియోలు ఉంటాయి.

 A Chicken Kicking A Monkey Video Viral On Social Media Viral Video, Monkey Video-TeluguStop.com

కుక్కలు తమ తెలివితో లేదా విశ్వాసంతో కూడిన చర్యలతో వైరల్‌గా నిలిస్తే, కోతులు మాత్రం తమ చిలిపి చేష్టలతో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.ఇవి ఇతర జీవులను గిల్లి మరీ కొట్లాటకు కూడా దిగుతుంటాయి.

ఈ ఫైట్స్ చూసేందుకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి.అయితే తాజాగా ఒక కోతి కోడితో కయ్యానికి కాలు దువ్వింది.

ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి.ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే ఒక రాయిపై కోతి కూర్చొని ఉండటం చూడవచ్చు.

ఆ రాతి వెనుక ఒక పెద్ద విగ్రహం ఉంది.ఇది రాయి కొన భాగాన కూర్చొని ఉండగా దాని దగ్గరకు ఒక కోడి వచ్చింది.

దాంతో ఆ కోడిని కోతి తన చేతితో ఒక దెబ్బ వేసింది.ఇది ఊహించని ఆ కోడి ఒక్కసారిగా షాక్ అయింది.

ఆ తర్వాత నన్నే కొడతావా.నీకు ఎంత ధైర్యం అన్నట్లు అది కూడా ఎటాక్ చేసింది.

అలా ఇవి రెండూ కొద్దిసేపు ఒకటికొకటి కొట్లాడుకున్నాయి.ఈ సమయంలో కోడి తన ముక్కుతో కోతిని పొడుస్తుండగా.

కోతి కోడిని చేతితో బలంగా కొట్టింది.అంతేకాదు ఆ కోడి మంకీని కిందకు తోసేందుకు ప్రయత్నించింది.

చివరికి కోడి పైన కోతి పైచేయి సాధించింది.దాంతో వీడియో ముగిసింది.

దీన్ని చూసిన నెటిజన్లు బాగా నవ్వుకుంటున్నారు.ఈ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube