28 ఏళ్ల మహిళను పెళ్లాడిన 66 ఏళ్ల క్రికెటర్.. 2022లో పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే..

ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లు పెళ్లి పీటలెక్కారు.2022 ప్రారంభంలో భారత్‌కు చెందిన విని రామన్‌తో గ్లెన్ మాక్స్‌వెల్ వివాహం జరిగింది.ఈ ఏడాది చివర్లో ముజాన్ మాలిక్‌తో హరీస్ రవూఫ్ వివాహం జరిగింది.మధ్యలో చాలా మంది క్రికెటర్లు వివాహాలు చేసుకున్నారు.2022లో వివాహం చేసుకున్న క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

 A 66-year-old Cricketer Who Married A 28-year-old Woman These Are The Cricketers-TeluguStop.com

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ విని రామన్‌తో మార్చి 2022లో వివాహం చేసుకున్నారు.

ఈ జంట చెన్నైలో భారతీయ వివాహ ఆచారాలను నిర్వహించారు, దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్‌గా మారాయి.ఈ జంట మార్చి 27న భారతీయ పద్ధతిలో వివాహాన్ని పూర్తి చేసుకున్నారు.

విని రామన్ ఆస్ట్రేలియాలోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నారు.వీరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు చేరుకుంది.

భారతదేశానికి చెందిన ఆల్ రౌండర్ దీపక్ చాహర్ తన చిన్ననటి ఫ్రెండ్ జయ భరద్వాజ్‌ను ఆగ్రాలోని ఒక హోటల్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.ఐపీఎల్ 2021 సమయంలో దుబాయ్‌లో జయకు చాహర్ ప్రపోజ్ చేశాడు.

ఆమె ఒప్పుకోవడంతో 2022లో వారి పెళ్లి జరిగింది.ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వగా ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, రాహుల్‌ చాహర్‌, శిఖర్‌ ధావన్‌, ఎంఎస్ ధోని వంటి క్రికెటర్లు హాజరయ్యారు.ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నాట్ స్కివర్ మే 30.2022న వివాహం చేసుకున్నారు.ఈ జంట ఐదేళ్లపాటు ఒకరితో ఒకరు డేటింగ్‌లో ఉన్నారు.వీరికి పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.

Telugu Catherine Brunt, Cricket, Cricketers, Nat Skiver-Latest News - Telugu

పాకిస్థాన్ క్రికెటర్ హరీస్ రౌఫ్ డిసెంబర్ 24న ఇస్లామాబాద్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు ముజ్నా మాలిక్‌ను వివాహం చేసుకున్నాడు.నిక్కా వేడుకకు పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు.న్యూజిలాండ్ ఆల్-రౌండర్ జిమ్మీ నీషమ్ తన చిరకాల ఫ్రెండ్ అలెక్స్ మాక్లియోడ్-స్మిత్‌ను డిసెంబర్ మొదటి వారంలో వివాహం చేసుకున్నాడు.ఈ వివాహానికి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

నవంబర్ 28, 2022న ముగ్గురు లంక క్రికెటర్లు చరిత్ అస్లంక, పాతుమ్ నిస్సాంక మరియు కసున్ రజిత ఒకే రోజున వివాహం చేసుకున్నారు.

ఈ ముగ్గురూ ఆస్ట్రేలియాలో జరిగిన T2O ప్రపంచ కప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.

వీటన్నింటి కంటే అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచింది మాత్రం భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ వివాహం.ఆయన తన 66 ఏళ్ల వయసులో 28 ఏళ్ల బుల్బుల్ సాహాను పెళ్లాడాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube