అంతకు మించి ఏం చేయగలరు?

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.కర్నాటకలోని కరువు ప్రాంతాల్లో రాహుల్ రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.

 Suicides No Solution-TeluguStop.com

తెలంగాణ, మహారాష్ట్ర, మరి కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే కర్నాటక కరువు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది.

రాహుల్ తన పాద యాత్రలో రైతు కుటుంబాలతో మాట్లాడారు.అనేక మంది రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని రాహుల్ని వేడుకున్నారు.

తను ప్రధానమంత్రిని కాదని, తాను పరిష్కరించలేనని అన్నారు.కాని ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు.

ఇక్కడి రైతుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియదు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడంలేదని అనుకోవాలి.

రైతులకు అన్ని దారులు మూసుకుపోయాక వారికి తెలిసిన పరిష్కారం ప్రాణాలు తీసుకోవడమే.కాని వారి నిస్సహాయ స్థితిని ప్రభుత్వాలు అర్ధం చేసుకోవడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube