అసలు రోగమా? మాయ రోగమా?

అవినీతి ఆరోపణలపైన, ఇతరత్రా నేరాలు చేసి పట్టుబడినవారికి వెంటనే అప్పటికప్పుడు ‘జబ్బులు’ పుట్టుకొస్తాయి.ఇవి ఎలా వస్తాయో తెలియదు.

 Where Is Sandra Venkata Veeraiah?-TeluguStop.com

అప్పటివరకూ బాగానే ఉంటారు.పోలీసులో, దర్యాప్తు సంస్థల అధికారులో వచ్చి అరెస్టు చేయగానే గుండె నొప్పి, వెన్ను నొప్పి, ఇంకెక్కడో నొప్పి వస్తాయి.

వెంటనే జైలుకు పోవల్సినవారు ఆస్పత్రికి పోతారు.వీలైనంత వరకు అక్కడే తిష్ట వేయాలని ప్రయత్నిస్తారు.

ఇప్పుడు నోటుకు ఓటు కుంభకోణంలో తెలంగాణ ఏసీబీ ప్రశ్నించాల్సిన టీడీపీ సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో ఉన్నాడు.ముందుగా విశాఖ వెళ్లాడు.

అక్కడి నుంచి రాజమండ్రి వచ్చాడు.ఏసీబీ నోటీసు ఇవ్వగానే హైదరాబాద్‌ విడిచి వైజాగ్‌ వెళ్లిపోయిన వెంకటవీరయ్య ‘నేను రాలేను.మీరు వైజాగ్‌ వచ్చి ప్రశ్నించవచ్చు.సహకరిస్తా’ అని చెప్పాడు.అలా చెప్పిన వ్యక్తి రాజమండ్రికి చేరుకున్నాడు.అక్కడ ఆస్పత్రిలోనూ లేకుండా దానిపైన ఉన్న పెంట్‌ హైజ్‌లో రహస్యంగా ఉన్నాట్ట…! తాను ఇంకొంతకాలం అజ్ఞాతంలో ఉండాలనుకుంటున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక విలేకరికి చెప్పాడట.

ఆ విలేకరికి పిలిచి చెప్పలేదు.విలేకరే గాలించి సండ్ర ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాడు.సండ్రకు వెన్నెముకలో, కుడి కాలిలో విపరీతమైన నొప్పి వస్తోందట.వస్తే వచ్చిందేమో…! మరి ఇంత పెద్ద హైదరాబాద్‌ నగరంలోని ఆస్పత్రులను వదిలేసి ఎక్కడో వైజాగ్‌కు, రాజమండ్రికి పోవడం ఎందుకు? నేరం చేసి ఉండకపోతే సిటీలోనే ట్రీట్‌మెంట్‌ తీసుకోవచ్చు కదా.కాబట్టి ఇది అసలు రోగం కాదు.మాయ రోగమే.

ఇలాంటి సలహాలు ఆయన న్యాయవాదులు ఇచ్చివుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube