కట్టి తీరుతాడట....!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను మొండోడినని, ఏదైనా అనుకుంటే చేసేదాకా నిద్రపోనని చెబుతుంటారు.ఇప్పుడు కూడా ఇదే మాట చెబుతున్నారు.

 Kcr Sticks By His Word-TeluguStop.com

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పేదోళ్లకు ఇళ్లు కట్టి తీరుతానని, తన నిర్ణయంలో మార్పు లేదని అంటున్నారు.కేసీఆర్‌ నిర్ణయాన్ని ఉస్మానియా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అయినా ఖాతరు చేయడంలేదు గులాబీ అధినేత.తాను ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోనని అంటున్నారు.

విద్యార్థుల ఆందోళన వెనక రాజకీయ నాయకులు ఉన్నారని,వారే విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని అన్నారు.విశ్వవిద్యాలయాలకు వందల,వేల ఎకరాల భూమి అక్కర్లేదని, గోల్‌్ఫ కోర్సులకు, రేస్‌ కోర్సులకు వందల ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు.

పేదలకు ఇళ్లు కట్టించేందుకు యూనివర్శిటీల భూములను వాడుకోవడంలో తప్పు లేదన్నారు.ఇదీ కేసీఆర్‌ ఐడియాలజీ.

వాస్తవానికి విశ్వవిద్యాలయాలు ప్రశాంతంగా ఉండాలి.భవిష్యత్తులో విస్తరణకు అవసరమైన భూమి ఉండాలి.

కాని ఈయన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తనకు ఓటు బ్యాంకు సృష్టించుకునేందుకు విశ్వవిద్యాలయం భూములు తీసుకోవడానికి తెగబడ్డాడు.విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేస్తేగాని కేసీఆర్‌ దిగిరాడు.

కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకొని ఇళ్లు కట్టాలిగాని విద్యా సంస్థల భూములు తీసుకోవడం ఏం న్యాయం?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube