మంచు హీరో పేల్చనున్నాడు

మంచు విష్ణు ప్రస్తుతం దేవ కాట్టా దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘అరిమ నంబి’ సినిమాను రీమేక్‌ చేస్తున్నారు.

 Manchu Vishnu As Dynamite-TeluguStop.com

ఈ సినిమాను మంచు విష్ణు సొంతంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు నిన్న మొన్నటి వరకు ఎదురీత అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘డైనమైట్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘అరిమ నంబి’ సినిమాలో పలు మార్పులు, చేర్పులు చేసి, తనదైన స్టైల్‌లో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు దేవ కట్టా.

ఈ సినిమాలో హీరో మంచు విష్ణు డైనమైట్‌లా సీరియస్‌గా ఉంటాడని, అందుకే ఈ టైటిల్‌ను పెట్టినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రణీత నటిస్తోంది.

వీరిద్దరు జతగా కలిసి నటించడం ఇదే ప్రథమం అనే విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube