బాలయ్య 'లయన్' పై 'టెంపర్' టెన్షన్!!!

నందమూరి వంశంలో బాలయ్య తర్వాత టాప్ హీరోగా మారిన హీరో ‘ఎన్టీఆర్’.దాదాపుగా మూడు ఏళ్లుగా భారీ హిట్ కోసం ఎన్టీఆర్ చెయ్యని ప్రయత్నం లేదు.

 Tempar Tension On Balakrishna Lion-TeluguStop.com

అయితే కాలం కలసి రాకో, లేక సరైన సమయం ఎదురుపడకో తెలీదు కానీ…మొత్తానికి గత మూడు ఏళ్ల నుంచి ఎన్టీఆర్ భారీ హిట్ కోసం భారీగానే ప్రయత్నించాడు.ఇక తన కోరిక నిన్న విడుదలయైన టెంపర్ తో తీరిపోయింది.

నిన్న విడుదలయిన ఈ చిత్రం సూపెర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.మరో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ చిత్రం ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అని అంటుంటే…మరో పక్క ట్రేడ్ వర్గాలు మాత్రం 50నుంచి 60కోట్లు వరకు వసూళ్లు సాదించే చిత్రం అని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.‘పటాస్’ ఆడియో వేడుకలో జూనియర్ అన్నట్లుగా ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా మారిపోయి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇద్దరి సినిమాలు సూపర్ హిట్ కావడంతో రాబోతున్న బాలకృష్ణ ‘లయన్’ పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోఓది అనే వార్తలు వినపడుతున్నాయి.

నందమూరి కుటుంబానికి చెందిన రెండు సూపర్ హిట్లు వరసగా వచ్చిన తరువాత వచ్చేనెల చివరిన ‘లయన్’ రాబోతూ ఉండటంతో అభిమానులలో విపరీతమైన అంచనాలు పెరిగి పోతాయని ఆ అంచనాలను అందుకోవడంలో బాలయ్య ‘లయన్’ ఏ మాత్రం వెనకడుగు వేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకుల వాదన.అంతేకాదు అబ్బాయిల సినిమా కలెక్షన్స్ స్థాయిని అందుకోకుండా ఒక ఎవరేజ్ హిట్ గా ‘లయన్’ మారితే అది బాలయ్య క్రేజ్ కు ఒక అడ్డు కట్టగా మారుతుందని సరి కొత్త విశ్లేషణలు తెరపైకి తీసుకువస్తున్నారు.

మరి అభిమానుల అంచనాలను లయన్ ఎంతవరకు చేరుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube