ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో రామ్ చరణ్(Ram Charan) చేస్తున్న ‘గేమ్ చేంజర్’(Gam hanger) సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇప్పటికే విజయవాడలో 256 అడుగుల ఎత్తులో రామ్ చరణ్(Ram Charan) కటౌట్ ని పెట్టడం అనేది యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరికి దక్కని ఒక అరుదైన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు.
మరి ఇలాంటి సందర్భంలోనే రామ్ చరణ్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.ఇక గేమ్ చేంజర్ సినిమా కూడా ఈ జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కాబట్టి ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అటు దిల్ రాజు, ఇటు రామ్ చరణ్, శంకర్ (Dil Raju, Ram Charan, Shankar)చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మరి వీళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ భారీగా వర్కౌట్ అయితే మాత్రం శంకర్ మరోసారి స్టార్ డైరెక్టర్ గా అవతరిస్తాడు.ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయని దిల్ రాజు సైతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోతాడు.ఇక గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ మరోసారి తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నవాడు అవుతాడు…ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…
.