హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే న్యాచురల్ టానిక్ ఇది.. తప్పక ట్రై చేయండి!

హెయిర్ ఫాల్(hair fall) అనేది అందరిలోనూ ఉండేదే అయినప్పటికీ కూడా కొందరిలో మాత్రం చాలా హెవీగా ఉంటుంది.జుట్టు విపరీతంగా రాలిపోవడం వల్ల మానసికంగా కృంగుబాటుకు గురవుతుంటారు.

 It Is A Natural Tonic That Controls Hair Fall! Hair Fall, Stop Hair Fall, Natura-TeluguStop.com

జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక సతమతమవుతుంటారు.అయితే ఒత్తిడి వల్ల జుట్టు మరింత ఎక్కువ రాలిపోతుంది.

కాబట్టి ఒత్తిడిని పక్కన పెడితే పరిష్కారం మార్గం సుగమం అవుతుంది.

ఇకపోతే హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడంలో ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టానిక్ (natural tonic)చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ టానిక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి… అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు రెబ్బలు వేపాకు(Neem), నాలుగు మందారం ఆకులు(hibiscus leaves) వేసుకోవాలి.

అలాగే పావు కప్పు సన్నగా తరిగిన కలబంద(aloe vera), వన్ టేబుల్ స్పూన్ మెంతులు(fenugreek), వన్ టేబుల్ స్పూన్ బియ్యం, ఐదు లవంగాలు(five cloves) వేసి ఉడికించాలి.పది నిమిషాల పాటు ఉడికిస్తే ఆల్మోస్ట్ మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.

Telugu Aloe Vera, Fenugreek, Care, Care Tips, Tonic, Healthy, Hibiscus, Natural

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే టానిక్ రెడీ అయినట్లే.ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టానిక్ నింపుకొని స్కాల్ప్ కి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసి మసాజ్ చేసుకోవాలి.గంట ఆనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Aloe Vera, Fenugreek, Care, Care Tips, Tonic, Healthy, Hibiscus, Natural

వారానికి ఒకసారి ఈ టానిక్ ను వాడటం వల్ల జుట్టు రాలడం వేగంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.అంటే ఈ టానిక్ ను ఉప‌యోగించ‌డం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాదు జుట్టు ఎదుగుదల కూడా మెరుగు పడుతుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా మారతాయి.పైగా చుండ్రు చికిత్సలోనూ ఈ టానిక్ అద్భుతంగా సహాయపడుతుంది.

వారానికి ఒకసారి ఈ టానిక్ వాడితే చుండ్రు సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube