అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప 2 సినిమా (Pushpa 2 Movie) ఎంతో మంచి సక్సెస్ అయ్యిందని ఆనంద పడటానికి కూడా వీలు లేకుండా పోయింది.మొదటిరోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం ఏకంగా పోలీసులు తనని అరెస్టు చేయడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.
ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్టు కావడంతో సినీ సెలబ్రిటీలు స్పందించిన తీరుపై నిండు సభలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదం కాస్త ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో కూడా తీవ్ర దుమారం రేపింది.
ఈ విధంగా అల్లు అర్జున్ పట్ల ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఏపీ డిప్యూటీ సీఎం(Ap Deputy CM) సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.ఈ ఘటనలో పోలీసుల తప్పు ఏమాత్రం లేదని చట్టం ప్రకారమే వారు విధులను నిర్వహించారని తెలిపారు.
ఇక హీరోలు మొదటి రోజు థియేటర్ కి వెళ్తే తప్పనిసరిగా వారు అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేయాల్సిందే ఇందులో అల్లు అర్జున్ ని ఒంటరి వాడిని చేశారు.ఇక ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ అతని టీం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే ఈ గొడవ అక్కడితోనే ఆగిపోయి ఉండేది.
గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు అంటూ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రస్తుతం సంచలనగా మారింది.అయితే పవన్ కళ్యాణ్ స్పందన పై నటి కస్తూరి శంకర్ (Kasturi Shankar) స్పందించారు.ఈ సందర్భంగా కస్తూరి శంకర్ మాట్లాడుతూ.పెద్దరికం అంటే పవన్ కళ్యాణ్ ఎంతో కచ్చితంగా పరిణితితో కూడిన స్పందన చేశారు.ఆయన మాటలలో ఎక్కడ పక్షపాతం లేదు ఎక్కడ కాంప్రమైజ్ లేదు అంటూ పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును ఈమె ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.