ప్రేమమ్ సినిమా(Premam Movie) ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి సాయి పల్లవి(Sai Pallavi) .మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన ఈమె తెలుగులోకి ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేసిన సాయి పల్లవి అనంతరం తెలుగులో పలువురు హీరోలతో సినిమా అవకాశాలను అందుకొని మంచి సక్సెస్ అందుకున్నారు.సాయి పల్లవి వృత్తిపరంగా వైద్యురాలు ఈమె తన వైద్య విద్యను పూర్తి చేశారు అయితే అనుకోని విధంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె అమరన్ సినిమా( Amaran ) ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ఇలా వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి భారీ స్థాయిలోనే ఆస్తులను కూడపెట్టి ఉంటుందని తెలుస్తుంది.
అయితే ఈమె ఆస్తుల వివరాలు తెలిస్తే కనుక షాక్ అవ్వాల్సిందే.ఇలా ఈమె ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించింది కేవలం 47 కోట్ల రూపాయలని మాత్రమే తెలుస్తుంది.
ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తున్న ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్న సాయి పల్లవి పెద్దగా ఆస్తులను సంపాదించకపోవడానికి కూడా కారణం లేకపోలేదు.సాయి పల్లవి సినిమాలలో నటిస్తుందంటే ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండాలి అలాగే ఎలాంటి గ్లామర్ షో కి దారి తీయకూడదు.ఇక ఈమె తన పరిధి దాటి సినిమాలలో అసలు నటించదు.ఆ సినిమాలో ఎలాంటి స్టార్ హీరో నటించిన నిర్మొహమాటంగా ఆ సినిమాకి నో చెబుతూ ఉంటారు.
దీంతో ఈమె తక్కువ రెమ్యూనరేషన్ తోనే సినిమాలలో నటించడం వల్లే పెద్దగా ఆస్తులను కూడా సంపాదించలేదని చెప్పాలి.