ప్రస్తుత రోజులలో ఆధార్ కార్డు లాగానే పాన్ కార్డు( PAN Card ) కూడా ప్రతి ఒక్కరికి తప్పనిసరన్న పరిస్థితి ఏర్పడింది.ఆదాయ పన్ను శాఖలో( Income Tax Department ) ప్రతి లావాదేవీకి పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది.
అంతేకాకుండా మన భారతదేశంలో వివిధ రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా పాన్ నెంబర్ తప్పనిసరి.అయితే పాన్ కార్డు 10 అంకెలు ఉన్న ఆల్ఫా న్యూమరికల్ నెంబర్.
దీనిని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు జారీ చేస్తారు.అలాగే టాక్స్ ప్రొసీడింగ్స్ ఆర్థిక లావాదేవులను ట్రాక్ చేయడానికి ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి.
అయితే., ఈ ఆదాయవనరును శాఖ వారు జారీ చేసే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ 10 అంకెలు కలిగి ఉంటాయి.
అది వ్యక్తిగత కార్డు తీసుకున్న లేదా.ఏదైనా సంస్థ తీసుకున్న కానీ పాన్ నెంబర్ లో 10 అంకెలు తప్పనిసరి.
అయితే ఈ పది అంకలలో ఒక్కో అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది.మనం ఇప్పుడు ఆ నెంబర్ల ప్రత్యేకత చూద్దాం.ముందుగా మొదటి మూడు డిజిట్స్ AAA నుంచి ZZZ వరకు ఉంటాయి.ఇవి ఆల్ఫాబెట్స్ సిరీస్ గా ఉంటాయి.ఇక నాలుగవ అంకె పాన్ హోల్డర్ స్టేటస్ ను( PAN Holder Status ) తెలుపుతుంది.ఒకవేళ ఆ అంకె A- అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, B – బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ C – కంపెనీ (సంస్థ), F- ఫర్మ్ (లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్), G – గవర్నమెంట్ ఏజన్సీ (ప్రభుత్వ సంస్థ), H – హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), J- ఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్, L – లోకల్ అథారిటీ, P – పర్సన్ (వ్యక్తి), T – ట్రస్ట్ అనే ఈ లెటర్స్ ఉంటాయి.
వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారందరికీ నాలుగో లెటర్ ‘P’ అనే ఉంటుంది.
ఇక అలాగే ఐదవ లెటర్ వ్యక్తి లేదా ఇంటి పేరులో మొదటి అక్షరం ఉంటుంది.అలాగే నెంబర్ లోని 6 నుంచి తొమ్మిదవ లెటర్లు మాత్రం 00001- 9999 నెంబర్ల మధ్య ఉంటుంది.ఇక ఈ పాన్ నెంబర్ 10వ డిజిట్లో ఆల్ఫాబెటిక్ చెక్ డీజిట్ అంటారు.
మొదటి తొమ్మిది డిజిట్ కో ఫార్ములా అప్లై చేసి చివరికి ఒక డిజిట్ను కంప్యూటర్ జనరేట్ చేస్తుంది.ఈ తరుణంలో దరఖాస్తుడి పేరు ఇంటి పేరు వ్యక్తిగత దరఖాస్తు చేస్తున్నాడా లేదా వ్యాపార సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడన్న వివరాలను బట్టి ఈ పదవ అక్షరాన్ని ఆదాయ పన్ను వారు నిర్ణయిస్తారు.
ఇక ప్రస్తుత రోజులలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, విదేశీ ప్రయాణం లేదా విదేశీ కరెన్సీ కోసం అప్లై చేసేందుకు ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.