బాలకృష్ణకు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయా..?.

నటసింహం నందమూరి బాలకృష్ణ( Natasimha Nandamuri Balakrishna ) అభిమానులపై చేయి చేసుకుంటాడని, చాలా అహంకారంగా మాట్లాడతారని ప్రజల్లో ఒక దురభిప్రాయం ఉంది.అంతేకాదు ఈయనకు కోపం ఎక్కువ అని కూడా చాలామంది మాట్లాడుతుంటారు.

 Good Habits Of Hero Balakrishna ,natasimha Nandamuri Balakrishna, Son-in-law Lok-TeluguStop.com

వాస్తవానికి పైకి ఆయన అలా కనిపిస్తారు కానీ మనసు మాత్రం చాలా మంచిది.ఈ విషయం ఆయనకు దగ్గరగా ఉన్న చాలా మంది చెబుతుంటారు.

చాలా భోళా మనిషి అని, మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటికి చెప్పేస్తారని, మనసులో కుట్ర పెట్టుకునే అలవాటు బాలకృష్ణకు లేదని అంటారు.ఇకపోతే ఈయనకి మరిన్ని మంచి లక్షణాలు ఉన్నాయని రీసెంట్ గా తెలిసింది.

Telugu Son Lokesh-Movie

బాలకృష్ణ చాలా బాగా నటిస్తారు.సినిమా పట్ల ఆయన చూపించిన డెడికేషన్ మరెవరూ చూపించలేరని చెప్పుకోవచ్చు.బాలయ్య ప్రతిరోజు ఉదయం 4:00కే నిద్రలేస్తారట.ఆ తర్వాత స్నానం చేసి, దైవ పూజ చేసుకుంటారు.

అనంతరం కొద్దిసేపు జిమ్ వర్కౌట్లు చేసి ఆపై టిఫిన్ చేస్తారు.అంతేకాదు ఉదయం వేల చుట్ట తాగే అలవాటు కూడా బాలకృష్ణకి ఉన్నదట.

అయితే ఒక రోజు ఆయన అల్లుడు లోకేష్( Son-in-law Lokesh ) “ఎందుకు మామ మీరు రోజూ చుట్ట తాగుతారు?” అని అడిగారంట.దానికి సమాధానం చెబుతూ “గొంతులోని కఫం, ఇతర గొంతు సమస్యలు రాకుండా, చెడుగా ఉన్నవన్ని పోయేలాగా తాను చుట్ట తాగుతాన”ని బాలకృష్ణ వివరించారట.

చుట్ట తాగే అలవాటును సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ నేర్చుకున్నారట.

Telugu Son Lokesh-Movie

ఇక సినిమాల విషయానికొస్తే బాలకృష్ణ ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీలో హీరో కాస్ట్యూమ్ ధరించి, అద్దం ముందు నిల్చొని ప్రతి సీన్‌, ప్రతి డైలాగు చెబుతూ బాగా ప్రాక్టీస్ చేస్తారట.ప్రతి సన్నివేశం కూడా బాగా వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేసి తర్వాతనే నటిస్తారట.అంతేకాదు దర్శకులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారట.

ఎన్ని టేక్ లు కావాలన్నా సరే నటిస్తానని దర్శకుల ముందు చాలా వినయంగా బాలకృష్ణ ఉంటారని సమాచారం.ఎస్వి కృష్ణారెడ్డి( SV Krishna Reddy ) ముందు చేతులు కట్టుకొని నిలబడిన బాలకృష్ణ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ ఫోటోలను చూస్తుంటే బాలకృష్ణ దర్శకులకు ఎంత గౌరవం ఇస్తారో చెప్పాల్సిన అవసరం లేదు.అంతేకాదు ఇటీవల భగవంత్‌ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా గురువుగారు అని పిలుస్తూ చాలా గౌరవించారు బాలకృష్ణ.

ప్రతి దర్శకుడిలో ఒక తండ్రిని చూసే ఒక గొప్ప మనస్తత్వం బాలయ్య బాబుకి ఉందనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube