టాలీవుడ్ లో చాలామంది అక్క చెల్లెలు హీరోయిన్స్ గా చెలామణి అయ్యారు.కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు.
ఎక్కువ శాతం అక్కలే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు.వారిని చూసి ఇండస్ట్రీ లోకి వచ్చిన చెల్లెళ్లలో చాలా తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ గా మారారు.
కాసేపు సినిమాల సంగతి పక్కన పెడితే పెళ్లిళ్ల విషయంలో అక్కల కన్నా ముందు చెల్లెలు చాలా తొందరపడి పెళ్లి చేసుకున్నారు.మరి ఆ అక్కాచెల్లెళ్ళు ఎవరు ? వారిలో చెల్లెలు ఎందుకు ముందుగా పెళ్లి చేసుకున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాయి పల్లవి చెల్లెలు
సాయి పల్లవి( Sai Pallavi ) టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా చెలామణి అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.అయితే ఆమె చెల్లెలు పూజ కన్నన్( Pooja Kannan ) కూడా హీరోయిన్ అవ్వాలని ఎంతో ఆశగా ఇండస్ట్రీలోకి వచ్చింది.అడపాదప ప్రయత్నాలు కూడా చేసింది.కానీ ఆమె హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో తాజాగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.పైగా సాయి పల్లవికి ఇంకా బోలెడంత కెరియర్ ఉన్నది ఉండడంతో ఆమె పెళ్లిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది.
కాజల్ అగర్వాల్ చెల్లెలు
కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) చెల్లెలు నిషా అగర్వాల్( Nisha Aggarwal ) సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని చిత్రాల్లో నటించింది.నటన పరంగా ఇద్దరిలో ఏమాత్రం తేడా లేకపోయినా సక్సెస్ పరంగా నిషా వెనుక పడడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు తప్పుకుంది.కాగా తను వివాహం చేసుకొని చాలా ఏళ్ల క్రితమే కాజల్ కన్నా ముందే సెటిల్ అయిపోయింది.
కూడా.ప్రసన్న కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుని ఒక కుమారుడికి కూడా జన్మ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
నగ్మా చెల్లెలు
ఇక కొన్నేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీకి వచ్చారు నగ్మా( Nagma ) మరియు ఆమె ఇద్దరు చెల్లెలు.ఆమెకి ఇద్దరు చెల్లెలు కూడా హీరోయిన్స్ కాగా ఇప్పటికీ నగ్మా వివాహం చేసుకోలేదు కానీ ఆమె చెల్లెలు అయిన జ్యోతిక( Jyothika ) మరియు రోషిని( Roshini ) వివాహ బంధంలోకి అడుగుపెట్టి హ్యాపీగా ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేస్తున్నారు.