ప్రతినిత్యం సోషల్ మీడియాలో ( social media )అనేక రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవడం గమనిస్తూనే ఉంటాం.ముఖ్యంగా క్రూర మృగాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.
ఇందులో భాగంగానే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో ఓ అడవి దున్నపోతు( Forest Buffalo ) అలాగే సింహం( lion ) పద్య భికర పోరును మనం చూడవచ్చు.
ఇకపోతే ఈ వైరల్ వీడియో గురించి చూస్తే.
ఓ దట్టమైన అడవిలో ముందుగా వెళ్తున్న అడవి దున్నపై సింహం దాడి చేయాలని ప్రయత్నిస్తుంది.అనుకున్నట్లుగానే అడవి దున్నపై సింహం దాడి చేస్తుంది.కాకపోతే ప్రతిరోజు మనది కాదన్నట్లు ఒక్కోసారి ఒక్కరోజు ప్రత్యర్థి కూడా కావచ్చు అన్నట్లుగా ఆరోజు అడవి దున్నది అయ్యింది.
అడవికి రారాజు అయిన సింహం కూడా అడవి దున్న ముందర తల వంచాల్సి వచ్చింది.ఈ రెండు జంతువుల మధ్య జరిగిన యుద్ధంలో అడవి దున్న తన కొమ్ములతో సింహాన్ని ఓ ఆట ఆడుకుంది.
దీంతో సింహం నెత్తురు కారుతూ నేలపై పడిపోయింది.
అయినా కానీ అడవిదున్న ఎలాంటి కనికరం చూపించకుండా సింహం పై పదేపదే తన పదునైన కొమ్ములతో దాడి చేసింది.ఈ దెబ్బతో సింహం లేవడానికి కూడా చేతకాక చివరికి మరణించింది.ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మనం ఎంత బలవంతులమైన రోజు మనది కాదు అన్నప్పుడు ఇలాంటి పరాభావాలే ఎదురవుతాయి అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.కాబట్టి కేవలం మన బలం మాత్రమే కాకుండా ఎదుటోడి బలం కూడా అంచనా వేసి ముందుకు వెళితే అనేక అపాయల నుంచి తప్పించుకోవచ్చు.