'ముద్రగడ 'నామకరణోత్సవం.. ఉప్మాలు ,కాపీలు మీరే తెచ్చుకోవాలండి 

” ఏమండీ మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గారు ఘన విజయం సాధించిన తరువాత తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి .కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన.

 Trollins On Mudragada Who Challenged To Pawan Klalyan ,mudragada Padmanabham ,m-TeluguStop.com

గమనిక :

మీ ఉప్మా కాపీలు మీరే తెచ్చుకోవాలండి ”

 అంటూ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి ( Mudragada Padmanabham )నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక పేరుతో జనసేన నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా( Social media )లో ట్రోలింగ్స్ కు దిగారు.తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు.

  ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామని కాపు ఉద్యమ నేత,  మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన సంగతి తెలిసిందే.  ఒకవేళ తాను పవన్ కళ్యాణ్ ను ఓడించ లేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చుకుంటాను అంటూ ఆయన సవాల్ చేశారు.

అయితే పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే సంకేతాలతో జనసైనికులు ముద్రగడను టార్గెట్ చేసుకున్నారు.

Telugu Kapu, Pavan Kalyan, Pitapuram-Politics

 పిఠాపురంలో సాయంత్రం ఐదు గంటల వరకు 71.3% పోలింగ్ నమోదయింది.రాత్రి సమయంలో కూడా క్యూ లైన్ లలో జనాలు బారులు తీరి ఓట్లు వేశారు .80 శాతానికి పైగా పోలింగ్ నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పవన్ విజయం ఖాయమని జన సైనికులు ధీమా తో ఉన్నారు.

  దీంతో పవన్ కు సవాల్ విసిరిన ముద్రగడ పై అప్పుడే ట్రోలింగ్స్ కు దిగారు.ముద్రగడ పద్మనాభం రెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక పేరుతో  ఇన్విటేషన్ ను ముద్రించి ట్రోలింగ్స్ కు దిగుతున్నారు.

Telugu Kapu, Pavan Kalyan, Pitapuram-Politics

 అందరికీ నమస్కారం ముద్రగడ నామకరణ మహోత్సవానికి రావాలని కాపు సోదర,  సోదరీమణులందరినీ ఆహ్వానిస్తున్నామని , జూన్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కార్యక్రమం జరుగుతుందని,  పవన్ విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని పెద్దాయన మాట ఇచ్చారని ఆ మాటపై ఆయన నిలబడతారనే నమ్మకం తమకు ఉందని , కాపులంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని,  దీనిని విజయవంతం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube