తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda)…ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో చాలావరకు సక్సెస్ కాలేకపోతున్నాయి.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అంత పెద్ద వైవిధ్యాన్ని సంతరించుకోకపోవడంతో ఆయన కొద్ది వరకైతే వెనుక పడాల్సిన అవకాశం అయితే వచ్చింది.
ఇక ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలన్నింటితో కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ కొట్టలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈయన చేస్తున్న సినిమా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అలాగే ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కథను కూడా మొదట బాలయ్య బాబు( Balakrishna ) రిజెక్ట్ చేసిన తర్వాత అది విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తుంది.స్టార్ హీరోలందరూ రిజెక్ట్ చేసిన కథలతోనే విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తున్నాడు.మరి ఆయనకు ఆ సినిమాలు ఎంతవరకు కలిసి వస్తాయి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా మంచి కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇకమీదట స్క్రిప్ట్ డిసీజన్ లో తేడాలు రాకూడదనే ఉద్దేశ్యం తోనే తను ఆచితూచి మరీ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాటుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది… నిజానికైతే విజయ్ దేవరకొండ ఇప్పటికే స్టార్ హీరో స్టేటస్ ని అందుకోవాల్సింది.కానీ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో చేసిన మిస్టేక్స్ వల్లే స్టార్ హీరో రేంజ్ ను అందుకోలేకపోతున్నాడు అనేది వాస్తవం…