వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది.ఈ సీజన్ లో రోగ నిరోధక వ్యవస్థ సహజంగానే బలహీన పడుతుంది.
పైగా చలి పులి దెబ్బకు చాలా మంది వ్యాయామాలు చేసేందుకు బద్దకిస్తుంటారు.ఈ రెండు కారణాల వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ రెండు దెబ్బ తింటాయి.
అలా జరగకుండా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవాల్సిందే.ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల వింటర్ లో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.
ఇప్పుడు ఆరెంజ్ పండు కి ఉన్న తొక్కలను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో ఆరెంజ్ పండు తొక్కలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఆరంజ్ పండు ముక్కలు, అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు కీర ముక్కలు, అర అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క, చిటికెడు బ్లాక్ సాల్ట్,

ఒక గ్లాస్ ఆరెంజ్ ఫీల్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో రుచికి సరిపడా తేనె వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అవుతుంది.
వారానికి కనీసం మూడు సార్లు అయినా ఈ డ్రింక్ ను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.
దాంతో బరువు తగ్గుతారు, ఫిట్ గా మారతారు.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల స్కిన్ కాంతివంతంగా సైతం మారుతుంది.