తెలంగాణ గవర్నర్ తమిళిసై పర్యటనలో మరోసారి ప్రొటోకాల్ వివాదం చెలరేగింది.సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ పర్యటిస్తున్నారు.
దీనిలో భాగంగా ఆమె కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు.అయితే గవర్నర్ టూర్ ల జిల్లా ఉన్నతాధికారులు ఎక్కడ కనిపంచకపోవడం గమనార్హం.
పర్యటనకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే గవర్నర్ పర్యటనలకు, కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదనే వాదనలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తన పర్యటన వివరాలు ముందుగానే చెబుతున్న అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు.







