పేద కుటుంబాలకు పది ట్రాక్టర్లు ఉచితంగా పంచిన రాఘవ లారెన్స్.. గొప్పోడంటూ?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను అందుకున్న రాఘవ లారెన్స్( Raghava Lawrence ) కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకోవడంతో పాటు ఎంతోమందికి సూర్తిగా నిలిచారు.కొన్నిరోజుల క్రితం దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ ( Three wheeler bikes )అందజేయడం ద్వారా వార్తల్లో నిలిచిన రాఘవ లారెన్స్ తాజాగా పేద కుటుంబాలకు పది ట్రాక్టర్లు ఉచితంగా పంచి మనుషుల్లో మహానుభావుడు అని అనిపించుకున్నారు.

 Raghava Lawrence Donated 10 Tractors To Poor People Details Here Goes Viral ,rag-TeluguStop.com
Telugu Tractors, Farmers, Kollywood, Rajakannan, Wheeler-Movie

కష్టాల్లో ఉన్న పది రైతు కుటుంబాలకు అండగా నిలిచిన రాఘవ లారెన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.గతంలో నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు.విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి మా మొదటి ట్రాక్టర్ ఇచ్చామని లారెన్స్ తెలిపారు.రాజకన్నన్ సోదరి భర్త చనిపోతే ఆమె కుటుంబాన్ని సైతం చూసుకుంటున్నారని లారెన్స్ అన్నారు.

Telugu Tractors, Farmers, Kollywood, Rajakannan, Wheeler-Movie

కొత్త ట్రాక్టర్ ను రాజకన్నన్( Raja kannan ) నడిపే సమయంలో అతని ముఖంలో ఆనందం, ఆశ చూడాలనేది నా కోరిక అని రాఘవ లారెన్స్ వెల్లడించడం గమనార్హం.అందుకే ఆ రైతును పిలిచి సర్ప్రైజ్ ఇచ్చామని రాఘవ లారెన్స్ వెల్లడించారు.కష్టాల్లో ఉన్న రైతులకు, ఆనందాన్ని మద్దతును అందజేద్దామని ఆయన తెలిపారు.రాఘవ లారెన్స్ చేసిన ఈ పోస్ట్ కు 4000కు పైగా లైక్స్ వచ్చాయి.రాఘవ లారెన్స్ లాంటి సెలబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇలా సంపాదించిన డబ్బులో కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేయడం కొందరికే సాధ్యమవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

లారెన్స్ మంచితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.రాఘవ లారెన్స్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.

లారెన్స్ క్రేజ్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube